![]() |
![]() |
.webp)
అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు మీద జరిగిన గలాటా గురించి అందరికీ తెలుసు. దానికి గురించి అమర్ దీప్ ఫ్రెండ్ లోలా నరేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. "నేను బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్ గా బయటకు ఓడిపోయి వచ్చాను. దాక్కోమని మీరంతా చెప్పారు. దాక్కోవడానికి నేనేమన్నా దొంగనా, డ్రగ్ మాఫియాలోంచి ఏమన్నా బయటకు వచ్చానా లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చానా.. అసలు విషయం ఏమిటో నాకు అర్ధం కాలేదు.
కొన్ని కార్లు, కొంతమంది మనుషులు వెంటబడి కార్లు పగలగొట్టి..నా తల్లి, నా భార్య పక్కనుండగానే అనరాని మాటలు అన్నారు. మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. మా నాన్న ఆర్టీసీ మెకానిక్ ఆయన ఇప్పటికీ పాస్ తీసుకుని దాని మీద బస్సులో ప్రయాణిస్తారు.. మా అమ్మ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్...మహిళలకు హెల్ప్ చేసే ఆవిడ ఇవన్నీ ఏం చేస్తుంది. అసలు మా అమ్మ, నాన్నకు నేను హ్యాపీగా ఉంటే చాలు...అంతకంటే ఏమీ కోరుకోరు. అలాంటిది ఈ ఇష్యూ మొత్తం వాళ్ళే చేసారని ఎలా అంటారు. మా బ్యాక్ గ్రౌండ్ తెలిసింది కాబట్టి మేమే చేయించామన్నట్టుగా మా మీద అపవాదు ఎలా వేస్తారు. నన్ను ఏదైనా అనండి, ఏదైనా చేయండి, ఎక్కడికైనా వస్తా ఫామిలీ జోలికి రావొద్దు..మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు. వాళ్ళను ఇలా అంటే మీరు ఊరుకుంటారా...నేను కూడా అంతే.. నాకు ఫామిలీ ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కొన్ని విషయాల్లో పూర్తిగా మారాను అంటే అది కేవలం షకీలమ్మ వల్లనే..ఆమె నాకు ఇంకో తల్లి. నేను అనుకున్నది సాధించాను. నాకు నచ్చిన వాళ్ళతో పని చేసే అవకాశం వచ్చింది. అది చాలు నాకు. నేనే విన్నర్ ని అని ఫీలవుతున్నాను "అని చెప్పాడు అమర్ దీప్. ఐతే లోల్ల నరేష్ కూడా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కి అమర్ దీప్ కారణం కాదు...పోలీసులు చెప్పింది పట్టించుకోకపోని కారణంగా ఈ అరెస్ట్ జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు.
![]() |
![]() |